ITI, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు భారీ అవకాశం - BEMLలో 1,346 అప్రెంటిస్ పోస్టులు..ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి | BEML Apprentice Recruitment 2026
BEML Apprentice Recruitment 2026 పేరుతో భారీ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ సంస్థ అయిన BEMLలో మొత్తం 1,346 అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, జనరల్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు తమ విద్యార్హతకు అనుగుణంగా ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
L&D/01/2026 నోటిఫికేషన్ ద్వారా ఈ అప్రెంటిస్‌షిప్ అవకాశాలను ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఉంటుంది. బెంగళూరు, మైసూరు, KGF, పాలక్కాడ్ ప్రాంతాల్లోని BEML యూనిట్లలో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది.
BEML Apprentice Recruitment – ముఖ్య వివరాలు
| అంశం | వివరాలు |
|---|
| సంస్థ | BEML Limited |
| నోటిఫికేషన్ నంబర్ | L&D/01/2026 |
| మొత్తం సీట్లు | 1,346 |
| పోస్టు | Apprentice |
| శిక్షణ వ్యవధి | 1 సంవత్సరం |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 18 ఆగస్టు 2026 |
| అప్లికేషన్ ఫీజు | లేదు |
| అధికారిక వెబ్‌సైట్ | recruitment.bemlindia.in |
విద్యార్హత
1. Graduate Technical: సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల ఫుల్‌టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ.
2. Graduate General: B.Sc, B.Com, BCA, BBA, BBA (HR) వంటి 3 సంవత్సరాల ఫుల్‌టైమ్ డిగ్రీ.
3. Diploma: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల ఫుల్‌టైమ్ డిప్లొమా.
4. ITI: సంబంధిత ట్రేడ్‌లో ITI అర్హత.
ఫైనల్ పరీక్షను దరఖాస్తు చివరి తేదీ నుంచి మూడు సంవత్సరాల లోపు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
BEML Apprentice స్టైపెండ్
ఎంపికైన అభ్యర్థులకు వారి విద్యార్హతను బట్టి నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు జనరల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు ₹12,300, డిప్లొమా అప్రెంటిస్‌లకు ₹10,900 చెల్లిస్తారు. ITI ట్రేడ్‌ను బట్టి ₹9,600 లేదా ₹10,560 వరకు నెలవారీ స్టైపెండ్ లభిస్తుంది.
వయోపరిమితి
BEML Apprentice Recruitment 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస వయస్సు 17 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు సమయంలో 17 సంవత్సరాలు పూర్తి కాని వారు అర్హులు కాదు. నోటిఫికేషన్‌లో గరిష్ట వయోపరిమితిని ప్రత్యేకంగా పేర్కొనలేదు.
ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
BEML Apprentice Recruitment 2026లో వివిధ విద్యార్హతలున్న అభ్యర్థులకు అవకాశాలు కల్పించారు. ప్రధానంగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, జనరల్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు, ITI అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు 4 సంవత్సరాల ఫుల్‌టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ అవసరం. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఆటోమొబైల్, ఇన్ఫర్మేషన్ సైన్స్, E&T, AI & ML, ఏరోనాటికల్ వంటి విభాగాలు ఇందులో ఉన్నాయి.
2. జనరల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు B.Sc, B.Com, BCA, BBA, BBA (HR) వంటి 3 సంవత్సరాల ఫుల్‌టైమ్ డిగ్రీలు అర్హతగా పేర్కొన్నారు.
3. డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్, కమ్యూనికేషన్, ఆటోమొబైల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ తదితర విభాగాల్లో 3 సంవత్సరాల ఫుల్‌టైమ్ డిప్లొమా ఉండాలి.
4. ITI అభ్యర్థులకు Fitter, Welder, Turner, Machinist, Electrician, COPA, Mechanic Diesel, Carpenter, Tool & Die Making, Sheet Metal, Plumber, Mechanic Auto Electrical & Electronics, MMV, Electronic Mechanic వంటి ట్రేడ్లలో అర్హత ఉండాలి.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
BEML Apprentice Recruitmentలో ప్రత్యేకంగా రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు. అభ్యర్థుల విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.
ప్రతి ట్రేడ్, ప్రతి లొకేషన్‌కు అందుబాటులో ఉన్న ట్రైనింగ్ సీట్లకు 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అర్హత నిర్ధారించిన తర్వాత మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ట్రైనింగ్ సీట్లకు ఎంపికైన వారికి ఎంగేజ్‌మెంట్ ఆఫర్ అందుతుంది. మిగిలిన అర్హత ఉన్న అభ్యర్థులను రిజర్వ్ వెయిటింగ్ ప్యానెల్‌లో ఉంచవచ్చు. ఖాళీలు ఏర్పడినప్పుడు మెరిట్ క్రమంలో వెయిటింగ్ ప్యానెల్ నుంచి అభ్యర్థులను తీసుకునే అవకాశం ఉంటుంది.
అవసరమైన పత్రాలు
దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి:
1. NATS/NAPS రిజిస్ట్రేషన్ నంబర్ మరియు 100% పూర్తి చేసిన ప్రొఫైల్
2. విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు
3. 10వ తరగతి మార్క్‌షీట్/సర్టిఫికెట్
4. SC/ST/OBC (NCL) కుల ధ్రువీకరణ పత్రం – వర్తిస్తే
5. బ్యాంక్ క్యాన్సిల్డ్ చెక్ లేదా పాస్‌బుక్ మొదటి పేజీ
6. ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రం
7. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
8. సంతకం
9. అవసరమైన ఇతర ధ్రువీకరణ పత్రాలు
ముఖ్య గమనిక: 10వ తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వంటి పత్రాల్లో అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ వివరాలు ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి.
BEML Apprentice Recruitment – ముఖ్య తేదీలు
| ఈవెంట్ | తేదీ |
|---|
| నోటిఫికేషన్ విడుదల | 18 ఆగస్టు 2026 |
| ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | 18 ఆగస్టు 2026 |
| దరఖాస్తుకు చివరి తేదీ | 8 సెప్టెంబర్ 2026 |
| దరఖాస్తు ముగింపు సమయం | రాత్రి 11:00 గంటలు |
| శిక్షణ వ్యవధి | 1 సంవత్సరం |
BEML Apprentice Recruitmen - ఎలా దరఖాస్తు చేయాలి
Step 1: NAPS/NATSలో రిజిస్టర్ అవ్వండి
Step 2: ప్రొఫైల్ పూర్తి చేయండి
Step 3: NAPS/NATS నంబర్ పొందండి
Step 4: BEML అధికారిక పోర్టల్‌కు వెళ్లండి
Step 5: అప్లికేషన్ ఫామ్ నింపండి
Step 6: డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
Step 7: వివరాలను పరిశీలించండి
Step 8: అప్లికేషన్ సబ్మిట్ చేయండి
Step 9: అప్లికేషన్ కాపీని భద్రపరచుకోండి
గమనిక: ఈ రిక్రూట్‌మెంట్‌కు అప్లికేషన్ ఫీజు లేదు. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ కూడా లేదు.
BEML Apprentice Recruitmen 2026
అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా NATS/NAPS రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఆ తర్వాత BEML అధికారిక పోర్టల్‌లో అప్లికేషన్ సమర్పించాలి. 2026 సెప్టెంబర్ 8 రాత్రి 11 గంటలే చివరి గడువు కాబట్టి చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
ముఖ్యంగా, అప్లికేషన్ సమర్పించే ముందు అధికారిక BEML నోటిఫికేషన్‌లోని అర్హతలు, ట్రేడ్, లొకేషన్, డాక్యుమెంట్లు మరియు ఇతర నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించండి.
BEML Apprentice Recruitment – ముఖ్యమైన లింకులు